రాహుల్ పర్యటలో మర్మమేంటి ?

రాహుల్ పర్యటలో మర్మమేంటి ?
కాంగ్రెస్ పార్టీ నేత, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ హడావిడిగా కేరళ రాష్ట్రం లో పర్యటిస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వైనాడ్  పార్లమెంట్ స్థానంతో పాటు, ఇతర ప్రాంతాలను కూడా ఆయన సందర్శిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ పర్యటన గురించి ఎవరికీ ముందస్తు సమాచారం లేకపోవడం గమనార్హం.
 ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్ పార్టీ నిత్యం ఏదో ఒక అంతర్గత వ్యవహారంతో తలమునకలై ఉంది. ఇవి తారాస్థాయికి చేరాయి.  పంజాబ్ రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రినే మార్చారు. అంతటితో అక్కడ రాచుకున్న అగ్ని మంటలు ఆరలేదు.  అక్కడి పిసిసి అధ్యక్షుడు కూడా పదవిని అలగి పదవిని త్యజించాడు.  పంజాబ్ లో పరిస్థితి  ఇలా ఉంటే, రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పోటీ చేస్తోంది.  ఈ ఎన్నికల వేడి ఎలాగూ ఉండనే ఉంది.  ఇదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దక్షిణాధి రాష్ట్రం కేరళలో పర్యటిస్తున్నారు. కేవలం రెండు మూడు  రోజులు మాత్రమే ఆయన  పర్యటన ఉండవచ్చని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తోనూ ఆయన బేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కేరళ కాంగ్రెస్ లోనూ అంతర్గత కుమ్ములాటలున్నాయి.  అవి పతాక స్థాయికి చేరక ముందే కాయకల్ప చికిత్స చేయాలని రాహుల్ భావిస్తున్నట్లుంది. 2019ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఉత్తర భారత దేశంలో పోటీ చేయాలనుకున్నా.... సేఫ్ సీట్ గా వైనాడ్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.  కేరళ కాంగ్రెస్ కమిటీ ఆధ్యక్షుడిగా  కే. సుధాకరన్ వ్యవహరిస్తున్నారు. ఈయన  త పదవి చేపట్టాకు జిల్లా కాంగ్రెస్ కమిటీల నియామకం జరిగింది. దీనిని సీనియర్ కాంగ్రెస్ నేతలు దశాబ్దాలుగా  కాంగ్రెస్ పార్టీని నడిపిన నేతలు రమేష్ చెన్నితాల వ్యతిరేకించారు.  ఆయనకు మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ  పరోక్ష మద్దతు ఉంది. దీంతో సహజంగానే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు తలెత్తాయి. ఒకరి వర్గం వారు మరోక వర్గం పై  విమర్శలు చేసుకున్నారు. ఇవి ఢిల్లీ వరకూ సాగాయి.  ఈ లోపల పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ లో అగ్గి రేగింది. దీంతో కేరళ సమస్య కాస్త వెనుక బడింది.   ముదిరి పాకాన పడక ముందే కేరళ కాంగ్రెస్ లో సమస్యలను పరిష్కరించేందుకు రాహుల్ స్వయంగా రంగంలోకి దిగారని కాంగ్రెస్ నేతలు బాహిరంగంగా నే పేర్కోంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: