ప్రధాని మోడీ బొమ్మ వద్దు !

ప్రధాని మోడీ బొమ్మ వద్దు !
భారత్ లో స్వతంత్ర ప్రతిపత్తి  కల్గిన వ్యవస్థల్లో ఇకపై  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బొమ్మ కనపడక పోవచ్చు. కేంద్రంలో ని ప్రభుత్వ కార్యలయాలకు అన్నింటికీ  నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్.ఐ.సి) సాంకేేతిక సహకారాన్ని అందిస్తుంది. భారత దేశం స్వాతంత్య్ర  అమృత మహోత్సవాలను పురస్కరించుకొని ఎన్.ఐ.సి ప్రభుత్వ అధికారి వెబ్ సైట్ లు, ఈ మెయిల్స్ లోనూ కొన్ని ప్రకటనలను చొప్పించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రచార చిత్రాలను కొన్నింటిని ఎన్.ఐ.సి 75 స్వతంత్ర అమృతోత్సవాల సందర్భంగా రూపొందించింది.  వీటికి ప్రధాన మంత్రి కార్యలయం పచ్చజెండా ఊపింది.
వీటిల్లో 'సబ్ కా వికాస్', 'సబ్ కా విశ్వాస్', 'సబ్ క సాత్' , 'సబ్ కా ప్రయాస్' తదితర నివాదాలతో ప్రచార చిత్రాలను ఎన్.ఐ.సి రూపొందించింది. వాటిల్లో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోటోలను కూడా ఉంచింది.. ఎన్.ఐ.సి నిర్వహించే అన్ని ఈ-మెయిళ్లకు ఈ ప్రచార చిత్రాలను  అనుసంధానం చేసింది.ఎన్.ఐ.సి నిర్వహించే ఈ-మెయిళ్ల లో సుప్రీం కోర్టు నుంచి వెళ్లే మెయిళ్లు కూడా ఉన్నాయి.. అత్యున్నత న్యాయస్థానం నుంచి క్రింది కోర్టులకు , ఇతర చోట్లకు వెళ్లే ఈ-మెయిళ్లలో దిగువ భాగాన  ప్రధాన మంత్రి ఫోటోతో కూడిన ప్రచార చిత్రాలుండటంతో   సుప్రీం కోర్టు  అభ్యంతంరం తెలిపింది. సుప్రిం కోర్టు రిజస్ట్రీ ఎన్.ఐ.సికి తన అభ్యంతరాన్ని లిఖిత  పూర్వకంగా తెలిపారు. న్యాయవ్యవస్థతో సంబంధం లేని ఫోటోలను, ప్రచారాలను సుప్రీం కోర్టు  అధికారిక వెబ్ సైట్ లలో పెట్టడం తగదని ఎన్.ఐ.సికి  తెలిపారు. దీంతో ఎన్.ఐ.సి తన తప్పును సరిదిద్దుకుంది. వెంటనే  ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను తొలగించింది. ఆ  స్థానంలో విద్యత్ కాంతులతో వెలుగులు విరజిమ్ముతున్న సుప్రీం కోర్టు ను ఉంచింది. స్వతంత్ర  ప్రతిపత్తి సంస్థల్లో  ప్రభుత్వ ప్రచారం పై సుప్రీం  కోర్టు   నిర్ణయం తీసుకోవడంతో మిగిలిన సంస్థలు కూడా అదే బాటలో పయనిస్తాయా ? అన్నది వేచి చూజడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: