ఐ.ఏ ఎఫ్ అధినేత గా వివేక్ రామ్ చౌధరి

ఐ.ఏ ఎఫ్ అధినేత గా వివేక్ రామ్ చౌధరి
భరత రక్షణ శాఖ లో భాగమైన వైమానికి శాఖ (ఇండియన్ ఎయిర్ ఫోర్స్)కు నూతన సైనికాధ్యక్షుడిగా ఎయిర్ మార్షల్ వివేవివేక్ రామ్ చౌదరి క్ రామ్ చౌదరి నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న అర్.కె బదౌరియా ఈ నెల 30 న పదవీ విరమణ చేయనుండటంలో నూతన సైనికాధ్యక్షుడిని నియమించాల్సి వచ్చింది. వివేక్ రామ్ చౌదరి 1982 డిసెంబర్ లో ఎయిర్ ఫోర్స్ లో చేరారు. అంచలంచలుగా ఎదిగారు. చాలా కష్టతరమై ప్రదేశాలలో పనిచేశారు. వాతావరణం ఏమాత్రం అనుకూలించని ప్రాంతాలలో పని చేస్తూ సహచరులతో ఉత్సాహం నింపే వ్యక్తిగా ఈయనకు వాయు సేనలో పేరుంది. బికనీర్ నుంచి లడక్ వరకూ ఉన్న వెస్ట్రన్ ఎయిర్ కమాండెంట్ (డబ్ల్యూ. ఎ.సి)లో ఆగస్టు 2020 నుంచి 2021 జూలై వరకూ పనిచేశారు.
అంతకు ముందు షిల్లాంగ్ లో ఈస్ట్రన్ ఎయిర్ కమాండెంటి (ఈఎసి) విభాగంలో సేవలందించారు. అంతే కాక చైనా సరిహద్దు వెంబడి (లైన్ ఆఫ్ కంట్రోల్) పని చేసిన అనుభవం ఉంది. అక్కడ సైనుకుల అవసరాల నిమిత్తం రహదారులు నిర్మించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు. ఆయన హయాంలోనే హిమాలయాల్లో రహదారుల నిర్మాణం జరిగింది. వివిధ రకాల ఫైటర్ జెట్లు,  ట్రైనర్ ఎయిరా క్రాఫ్ట్ లలో 3800 పైగా గంటలు  ప్రయాణించిన అనుభవం వివేకా రామ్ చౌదరి సొంతం. ఈయనకున్న విశేష అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం నూతన వాయుసేనాధిపతిగా నియమించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: