రికార్డు సృష్టించిన ఈ -సంజీవని

Chaganti
ఈ -సంజీవని అనే నేషనల్ టెలిమెడిసిన్ సర్వీస్ కోటి 20 లక్షల సంప్రదింపులు పూర్తి చేయడం ద్వారా మరో మైలురాయిని దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఆరోగ్య సేవల సంప్రదింపుల కోసం రోగులు రోజూ ఈ కొత్త డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించి వైద్యులు మరియు నిపుణులతో కనెక్ట్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం ఈ జాతీయ టెలిమెడిసిన్ సేవ 31 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఈ  ఇ-సంజీవనిఎబి-హెచ్‌డబ్ల్యుసి, డాక్టర్-టు-డాక్టర్ టెలిమెడిసిన్ ప్లాట్‌ఫామ్, సుమారు 21,000 హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు మరియు జిల్లా ఆసుపత్రులు మరియు మెడికల్ కాలేజీలలో సుమారుగా 1900 కేంద్రాలలో 30 రాష్ట్రాలలో స్పోక్స్‌గా అమలు చేయబడింది. ఈ డాక్టర్-టు-డాక్టర్-టు-టెలిమెడిసిన్ ప్లాట్‌ఫామ్ 32 లక్షల మందికి పైగా రోగులకు సేవలు అందించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: