జిరాక్స్ పేప‌ర్ల‌తో రేవంత్ షో?

Garikapati Rajesh

పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి త‌న స‌వాల్‌ను స్వీక‌రించ‌లేద‌ని తెలంగాణ మంత్రి మ‌ల్లారెడ్డి అన్నారు. కొన్ని జిరాక్స్ పేప‌ర్లు తీసుకువ‌చ్చి ఏవేవో మాట్లాడుతూ త‌న‌పై భూక‌బ్జా ఆరోప‌ణ‌లు చేశార‌ని, అబ‌ద్దాల‌తో త‌న ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాల‌నుకుంటున్నారంటూ మండిప‌డ్డారు. శ‌నివారం ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్న‌ప్ప‌టినుంచే రేవంత్ బ్లాక్‌మెయిల్ చేయ‌డం మొద‌లుపెట్టార‌ని, ఆసుప‌త్రిని అన్నిర‌కాల అనుమ‌తులు తీసుకొనే క‌ట్టామ‌ని, పేద‌ప్ర‌జ‌ల‌కు మెరుగైన చికిత్స‌నందించాల‌నే ఉద్దేశంతోనే వాటిని నిర్మించ‌డం జ‌రిగింద‌ని, ఎటువంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌లేద‌ని మ‌ల్లారెడ్డి మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర నుంచి అన్నీ అబ‌ద్దాలు చెప్ప‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న రేవంత్‌రెడ్డి జిరాక్స్ పేప‌ర్లు తెచ్చి షో చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. త‌న కోడ‌లు పేరుమీద ఉంది 350 గ‌జాలేన‌ని, ఐదెక‌రాలు కాద‌న్నారు. ఆ స్థ‌లంలోనే ఆసుప‌త్రిని నిర్మించాన‌ని, నిజ‌నిజాలు తెలుసుకోకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డ‌మే రేవంత్‌రెడ్డి ప‌నిగా పెట్టుకున్నారంటూ తీవ్రస్థాయిలో మండిప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: