కేసీఆర్ ఎఫెక్ట్ : ఆర్టీసీకి కొత్త బాస్ - మంచి రోజు ముందుంది!
సైబరాబాద్ సీపీకి అనూహ్య రీతిలో స్థాన చలనం
పవర్ ఫుల్ ఆఫీసర్ కు మరో కీలక బాధ్యత
తెలంగాణ ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తూ, ఇవాళ ఉత్తర్వుల ప్రక్రియను షురూ చేసింది. ఆర్టీసీకి ఎండీగా పో లీసు బాస్ సజ్జనార్ ను, అదేవిధంగా సైబరాబాద్ పోలీసు కమినర్ గా స్టీవెన్ రవీంద్రను నియమించింది. ఈ నియామకాలు రాష్ట్ర రాజధానిలో చర్చనీయాంశం అయ్యాయి. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా మంచి పేరున్న సజ్జనార్ ను ఆర్టీసీ ఎండీగా నియమించడం వె నుక ఉన్న ఆంతర్యం ఏంటన్నది అంత తేలిగ్గా అంతుపట్టకపోయినా, నష్టాలలో ఆర్టీసీని ఓ దారికి తెచ్చేందుకు ఇటువంటి సమర్థ అధికారులను నియమించాలన్న ఆలోచనలో భాగంగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు అని ఓ అంచనా!
వరంగల్ లో ఇద్దరు అమ్మాయిలపై యాసిడ్ దాడికి పాల్పడ్డ నిందితులను ఎన్కౌంటర్ చేయడంతోనూ,అదేవిధంగా హైద్రాబాద్ నగర శివార్లలో జరిగిన దిశ ఘటనకు సంబంధించి అత్యాచార నిందితులను ఎన్కౌంటర్ చేయడంతోనూ సజ్జనార్ విపరీతం అయి న క్రేజ్ తెచ్చుకున్నారు. తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి ఇటువంటి చర్యలే తగిన బుద్ధి చెబుతాయని ఆ రోజు సజ్జనార్ కు ప్రజల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. పౌర హక్కుల సంఘాలు విభేదించినప్పటికీ ప్రభుత్వం తరఫున సజ్జనార్ కు మాత్రం మంచి మద్దతే అందింది. ఈ క్రమం లో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.
అటుపై కరోనా సమయంలోనూ మంచి సేవలు అందించిన ఆఫీసర్ గా పేరు తెచ్చు కున్నారు. లాక్డౌన్ ను పక్కాగా అమలు చేసిన అధికారిగా కేసీఆర్ దగ్గర మంచి మార్కులు తెచ్చుకున్నారు. మూడేళ్లకు పైగా సైబరాబాద్ సీపీగా పనిచేస్తున్న ఆయన ఎన్నో వి నూత్న సంస్కరణలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆడ పిల్లల భద్రతకు సంబంధించి, సైబర్ క్రైం నియంత్రణకు సంబంధించి, అంతరాష్ట్ర నేరస్తులకు సంబంధించిన కేసుల కు సంబంధించి ఆయన పనితీరు ఎన్నో సార్లు ప్రత్యేకమయిన పేరు తెచ్చుకుంది.