అమ్మో ! రాజమౌళీ కొడ్తాడు??
సుకృతం అన్న పదం వాడాడు
తారక్ ..
అలానే అన్నాడు పలికాడు చరణ్
మన్యం వీరుడి పాత్రతో పరిణితి
వచ్చింది చరణ్ కు
భీం పాత్రలో లీనమై పోయాడు తారక్
రామారావు గారు ఆవహించారు
చిన్న మాట కాదండీ చాలా పెద్ద మాట
అల్లూరి దీవెనలు అందించాడు
ఇది గొప్ప మాట
రెండు గొప్ప పాత్రలకు ఆ తారలు
తమ వెలుగులు జోడించి నిండుదనం ఇచ్చారు
చెమట చిందించి వెలుగు ధారల్లో వెలిగిపోయారు
బాబోయ్ ఎక్కువ చెప్పకూడదు ఆయన కోపం అవుతారు అని అంటున్నాడు తారక్ .. ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోలో!ఇది సుకృతం ఇంత గొప్ప పాత్రలు చేయడంతోనే జీవితంలో ఓ ధన్యత కాదు జీవితానికే ధన్యత.. ధన్యోస్మి అంటారు కదా! ఆ మాటే అ న్నాడు తారక్.. మన కన్నా తెరపై మన పాత్రల నడవడి కన్నా ఆయన విజువల్ ట్రీట్ ఇంకా బాగుంటుంది. అది తెరపై చూసి ఆ నందించాలి. అందుకు నేనే సాక్షి అంటున్నాడు తారక్. జక్కన్నకు థాంక్స్ చెప్పి..మరో మారు తమ కృతజ్ఞతలు చెల్లించారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఒక ప్రమోషన్ లెవల్ ఈ షో అని ఎవ్వరు అన్నా.. అనుకున్నా ఇదే నిజం.. ఈ సీతారాము డు..ఆ మన్యం వీ రుడు..ఈ కొమురం భీముడు.. ఆ ఆదివాసీ తెగల వీరుడు.. ఈ రోజు మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తున్నారు.. ఈ వెలుగులలో కొన్ని చీ కట్లు తొలగాయి.. కృతజ్ఞత చెప్పడంతో తమకు తాము దక్కించుకున్న గౌరవాన్ని చాటారు ఆ ఇద్దరూ..