కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై టీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి కేంద్రమంత్రి అయినా తెలంగాణా కు ఒరిగిందేమి లేదని వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి హుందాగా ఉండాలని..చిల్లర రాజకీయాలు చేయొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణ లో టూరిజం కు ఒక్కరూపాయి అయినా ఇచ్చిందా? అంటూ మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే బండి సంజయ్ పరువు తీసుకున్నాడని అన్నారు.
కిషన్ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలు ఆపేయాలంటూ హెచ్చరించారు. పెట్రోల్ ధర పెరిగిందో లేదో, డీజిల్ గ్యాస్ ధరలు పెంచారో లేదో చెప్పాలంటూ కిషన్ రెడ్డి పై మంత్రి ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు. మిషన్ భగీరథ కు మెచ్చుకున్నారని కానీ పైసా ఇచ్చిందా కేంద్రం అంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి కిషన్ తన యాత్రలో టీఆర్ఎస్ పై విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే.