బంజారాహిల్స్ లో ఓ వ్యక్తి నకిలీ ఇన్స్పెక్టర్ అవతారంలో డాక్టర్ ను భయభ్రాంతులకు గురి చేశాడు. ఖమ్మం సీఐని అంటూ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు పక్కాగా ప్లాన్ చేసి పట్టుకున్నారు. విచారణలో అసలు నిజం బయటపడింది. ఈ తతంగాన్ని అంతా నడిపించింది గతంలో డాక్టర్ వద్ద డ్రైవర్ గా పని చేసిన మహేష్ అనే వ్యక్తి. మహేష్ గతంలో బాధిత డాక్టర్ వద్ద డ్రైవర్ గా పని చేసేవాడు. అయితే తనకు సంబంధించిన కాల్ రికార్డ్స్ ను మహేష్ తీసుకుంటున్నాడన్న విషయం గమనించిన డాక్టర్ అతన్ని వెంటనే ఉద్యోగంలో నుంచి తొలగించాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన మహేష్ తనకు తెలిసిన వ్యక్తితో వైద్యుడికి ఫోన్ చేయించి, తాను ఖమ్మం సీఐని అని, 75 లక్షలు ఇవ్వాలని, లేదంటే తమ దగ్గర ఉన్న కాల్ రికార్డ్స్ బయట పెడతామని బెదిరించారు. దీంతో వైద్యుడు గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించారు. బంజరహహిల్స్ పోలీసులు మాటువేసి ఆ కేటుగాడిని పట్టుకున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: