ఆఫ్గ‌న్‌పై ఏం చేద్దాం?

Garikapati Rajesh


ఆఫ్గ‌నిస్తాన్‌లో కొలువు తీరిన తాలిబ‌న్ల‌తో వ్య‌వ‌హ‌రించాల్సిన తీరు.. ఆ దేశంలో చోటుచేసుకుంటున్న తాజా ప‌రిస్థితులు.. భార‌తీయుల‌ను తీసుకురావ‌డానికి అనుస‌రించాల్సిన మార్గాల‌పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. హోంశాఖ మంత్రి అమిత్ షా, ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, విదేశాంగ‌శాఖ మంత్రి ఎస్‌.జ‌య‌శంక‌ర్‌, ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మాలా సీతారామ‌న్‌, జాతీయ భ్ర‌ద‌తా స‌ల‌హాదారు అజిత్‌దోవ‌ల్ పాల్గొన్నారు. ఆఫ్గ‌నిస్తాన్‌లో ప‌రిస్థితులు రోజురోజుకు ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తుండ‌టంతో ఆయా దేశాలు త‌మ పౌరుల‌ను తీసుకువెళ్ల‌డానికి ప్ర‌త్యేక విమాన స‌ర్వీసులు న‌డుపుతున్నాయి. అక్క‌డ ఉన్న భార‌త రాయ‌బార కార్యాల‌య అధికారులు, సిబ్బందిని త‌ర‌లించ‌డం భార‌త్ ఇప్ప‌టికే పూర్తిచేసింది. పౌరుల‌ను కూడా తీసుకురావ‌డానికి వాయుసేన రంగంలోకి దిగింది. అమెరికా బ‌ల‌గాలు, ఆఫ్గ‌న్ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని వారంద‌రినీ స్వ‌దేశానికి తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.  కాబూల్ న‌గ‌రంలో క‌ర్ఫ్యూ ఉండ‌టంతో న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌ను విమానాశ్ర‌యానికి తీసుకురావ‌డ‌మే పెద్ద స‌మ‌స్య‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: