ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దాంతో దేశం నుండి ప్రజలు పక్క దేశాలకు పారిపోతున్నారు. తాలిబన్లు కాబూల్ ను సైతం తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ప్రజలు ఎయిర్ పోర్ట్ కు భారీగా చేరుకుంటున్నారు. దాంతో విమానాలన్ని ప్రజలతో నిండిపోతున్నాయి. అయితే తాజాగా ఓ ఇంగ్లీష్
మీడియా బయట పెట్టిన వీడియో సంచలనం రేపుతోంది. తాలిబన్ల నుండి తప్పించుకునే క్రమంలో ఇద్దరు పెద్ద సాహసం చేసి మృత్యువాత పడ్డారు. ఇద్దరు వ్యక్తులు విమానంలో చోటు లేకపోవడంతో విమానం వీల్స్ కు ఒక తాడుతో తమను కట్టుకున్నారు.
అయితే విమానం గాలిలో ఎగురుతున్న క్రమంలో తాడు తెగిపోవడంతో ఇద్దరు గాల్లో నుంచి కింద పడ్డారు. అయితే వీడియోలో కేవలం కింద పడుతున్నట్టు మాత్రమే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. హృదయ విదారకంగా ఉన్న ఈ వీడియో ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రాణాలు కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో చూపిస్తోంది. మరోవైపు హమీద్ కర్జాయి ఎయిర్ పోర్ట్ నుండి ఐదుగురు ని తీసుకువెళ్లి తాలిబన్లు హతమార్చినట్టు తెలుస్తోంది.