హుజురాబాద్ ఎన్నికల్లో బిజెపి నుండి ఈటల రాజేందర్ పోటీ చేస్తారని క్లారిటీ వచ్చి చాలా రోజులు అవగా ఇటీవల టీఆర్ఎస్ కూడా తమ అభ్యర్తిని ప్రకటించింది. టిఆర్ఎస్ నుండి ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ పోటీ చేస్తారని స్పష్టం చేసింది. దాంతో కాంగ్రెస్ నుండి హుజురాబాద్ బరిలో దిగేది ఎవరన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కీలక నేత పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ నుండి వరంగల్ మాజీ మంత్రి కొండా సురేఖ హుజురాబాద్ బరిలోకి దిగుతారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మేరకు తెలంగాణ పిసిసి యోచిస్తోందని తెలుస్తోంది. అంతేకాకుండా వరంగల్ లో బలమైన నేతగా పేరు ఉన్న కొండా సురేఖ కు పద్మశాలి మున్నూరు కాపు సామాజిక వర్గం ఓట్లు పడతాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుండి కృష్ణా రెడ్డి, కమలాకర్ రెడ్డి పేర్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి వీరిలో హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు ఖరారు అవుతారన్నది తెలియాల్సి ఉంది.