నా దెబ్బ అలా ఉంది... ఈటెల సెటైర్

ప్రజా దీవెన పాద యాత్రలో భాగంగా  వీణవంక మండలంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్  మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. మంత్రులకే దొరకని సీఎం.. ఎంపీటీసీ, సర్పంచ్ లతో ఫోన్ లో మాట్లాడుతున్నాడు అని అన్నారు. మన దెబ్బ అలా ఉంది అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఇంత మంది మంత్రులు, ఎమ్మెల్యే లు నా మీదకు వస్తున్నారు అని పోలీసులకు కూడా ఈటెల రాజేందర్ గెలువాలని ఉందని వ్యాఖ్యానించారు.

కెసిఆర్ కి మనిషి కనిపించడు, ఓటు మాత్రమే కనిపిస్తదన్నారు. అది వాళ్ళ సంస్కారం ఆలోచన కుర్చీ, ఆశయం పవర్ మీదనే అంటూ వ్యాఖ్యలు చేసారు. ఫీల్డ్ అసిస్టంట్ల కంట్లో కెసిఆర్ మట్టి కొట్టిండు అని విమర్శలు చేసారు. పోషమ్మ కూడబెడితే మైసమ్మ మాయం చేసినట్లు ఉంది కెసిఆర్ పని అని విమర్శించారు. అధికారంలో  ఉన్నవారు ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: