తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఎల్.రమణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రమణ టిడిపికి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. మొదట కేటీఆర్ రమణ కు ప్రాథమిక సభ్యత్వం ఇవ్వగా ఆ తర్వాత కెసిఆర్ సమక్షంలో రమణ టిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. తనతోపాటు ఆయన అనుచరులు కార్యకర్తలు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా తాజాగా టిడిపి తెలంగాణ అధ్యక్షుడిని చంద్రబాబు ఖరారు చేశారు.
టిడిపి తెలంగాణ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు ను నియమించారు. టిడిపి ప్రెసిడెంట్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ లను కూడా చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బక్కని నర్సింహులు గతంలో షాద్నగర్ ఎమ్మెల్యే గా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో టిడిపి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీని వీడకుండా పార్టీని బోలపేతం చేసేందుకు కృషి చేశారు. ఈ అభిప్రాయంతోనే చంద్రబాబునాయుడు ఆయనకు అధ్యక్ష పదవిని కట్టబెట్టారని తెలుస్తోంది.