ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటనకు వెల్లనున్నారు. సీఎం జగన్ ఉదయం 10.10 నిమిషాలకు తాడేపల్లి నుండి హెలికాఫ్టర్‌లో బయలుదేరతారు. 11.10 గంటల నుండి 12 వరకు క్షేత్ర స్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించబోతున్నారు. అనంతరం ఒంటి గంట వరకు ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం అధికారులకు పోలవరం త్వరిగతిన పూర్తి చేసేందుకు పలు సూచనలు సలహాలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.
అంతే కాకుండా సీఎం పర్యటన ముగించుకున్న అనంతరం మధ్యాహ్నం 2.20 నిమిషాలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇదిలా ఉండగా సీఎం జగన్ పోలవరం బాట పడుతుంటే....టీడీజీ జాతీయ అధ్యక్షుడు నారా లేకేష్ రాష్ట్రం లో ఉన్న నిరుద్యోగులకు అండగా పోరుబాట పడుతున్నారు. మరోవైపు సీఎం జగన్ ఇంటి వద్ద ఈ రోజు ఉదయం నుండి ఉధ్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. TNSF, AISF, విద్యార్థి సంఘాలు సీఎం ఇంటి ముట్టడికి యత్నించాయి. దాంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.