ప్రతీ వ్యక్తి మీద కేసీఆర్, మోడీ ఇద్దరు కలిసి ఆరు లక్షల అప్పు చేశారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐజి ప్రభాకర్ తమ కార్యకర్తల ఫోన్లు టాప్ చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఎంతకాలం ఉంటారో గుర్తు పెట్టుకోవాలంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. వచ్చే రాజ్యం ఇక సోనియమ్మదేనని అన్నారు. ప్రభకర్ రావు ఓ ప్రైవేట్ సైన్యం సృష్టించారంటూ రేవంత్ ఆరోపించారు. తమను ఎంతో ఇబ్బంది పెడుతున్నారని...తాము అధికారంలోకి వచ్చాక ప్రభాకర్ రావు నువ్వు ఎక్కడ పడుకున్నా బయటకు గుంజుకొస్తామంటూ వ్యాఖ్యానించారు.
జైలు గోడల మీద బొగ్గు గీతలు గీసుకోవాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ బందువులంతా పక్క దేశాల పాస్ పోర్ట్ లు తెచ్చుకుంటున్నారని రేవంత్ అన్నారు. వాళ్లు ఎక్కడ దాచుకున్నా శిక్ష తప్పదని అన్నారు. తాము అపాయింట్ మెంట్ కోరగానే గవర్నర్ పుదుచ్చేరి వెళ్ళిందని...గవర్నర్ మీద, మోడీ, కేసీఆర్ తమకు నమ్మకం లేదని చెప్పారు. కానీ తమకు అంబేద్కర్ మీద నమ్మకం ఉందని అన్నారు. లోయర్ ట్యాంక్ బండ్ అంబెడ్కర్ విగ్రహం వద్దకు వెళ్లి తాము వినతి పత్రం ఇస్తామని రేవంత్ చెప్పారు.