ఉత్తరప్రదేశ్ సీఎం
యోగి ఆదిత్యానాథ్ పై
ఆస్ట్రేలియా ఎంపీ క్రెయిగ్ కెల్లీ ప్రశంసలు కురిపించారు. ఆదిత్యానాథ్ కరోనాను కట్టడి చేసిన విధానంపై క్రెయిగ్ కెల్లీ ప్రశంసించారు. అంతే కాకుండా తమ దేశం ఆస్ట్రేలియాలో కూడా కరోనా కట్టడికి
యోగి సహాయం కోరారు. ఈ మేరకు క్రెయిగ్ కెల్లీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. పోస్ట్ లో...మా దేశంలో కరాను జయించడాని భారత్ యూపీ సీఎం యోగిని మా కోసం పంపించే అవకాశం ఉంది.
కరోనాను కంట్రోల్ చేయడానికి ఉత్తరప్రదేశ్ సీఎం అవలంభించిన విధానాలను అభినందిస్తున్నాను. కరోనా వేవ్ ను కంట్రోల్ చేయడంలో ఆయన ఎంతో కృషి చేసారు. ఐవర్ మెట్రిక్ విదానాన్ని ప్రవేశపెట్టి కరోనా పాజిటివ్ వచ్చిన వారి నుండి ప్రజలు, ఆరోగ్య కార్యకర్తలు ను రక్షించారు. అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా
యోగి ఆదిత్యానాథ్ పై ఇటీవల ప్రశంసలు కురిపించారు.