తిరుమల వెళ్ళే భక్తులకు అలెర్ట్...?
నడక మార్గంలో ప్రస్తుతం జరుగుతున్న మరమ్మత్తు పనులను సెప్టెంబరు మాసం లోపు పూర్తి చెయ్యాలని అధికారులను ఈవో జవహర్ రెడ్డి ఆదేశించారు. గత నెల 1 వ తేది నుంచి అలిపిరి నడక మార్గాన్ని అధికారులు మూసి వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు మాసం వరకు శ్రీవారి మెట్టు నడక మార్గంలోనే భక్తులను టీటీడీ అనుమతిస్తుంది. మరికొన్ని ప్రదేశాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.