బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ రాక్షసుడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా విజయంతో తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ గా రాక్షసుడు 2 ను అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి పోతున్నట్టు ప్రకటించారు.
ఇక పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో స్టార్ హీరో నటించబోతున్నట్లు ప్రకటించారు. ఆ హీరో ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేశారు. రాక్షసుడు సినిమాకు మంచి టాక్ రావడంతో సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం రమేష్ వర్మ రవితేజతో ఖిలాడి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పుడు రాక్షసుడు సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమాలో ఏ స్టార్ హీరో నటిస్తారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.