మిల్కీ బ్యూటీ తాప్సి ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ మారిపోయింది. వరుస సినిమాలు చేస్తూ నార్త్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే తెలుగులో మాత్రం ఈ బ్యూటీ సినిమాలు బాగా తగ్గించేసింది. 2019లో "గేమ్ ఓవర్" అనే థ్రిల్లర్ తో ప్రేక్షకులను పలకరించిన తాప్సి ఆ తరువాత మరో తెలుగు సినిమాలో కన్పించలేదు. దీంతో ఆమెను సౌత్ లో ఉన్న ఫ్యాన్స్ బాగా మిస్ అవుతున్నారు. అందుకే చాలా గ్యాప్ తరువాత తన అభిమానులకు గుడ్ న్యూస్ ఇస్తూ ఓ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
డైరెక్టర్ స్వరూప్ దర్శకత్వంలో "మిషన్ ఇంపాజిబుల్" అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో తాప్సి హీరోయిన్. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' అనే బ్లాక్ బస్టర్ మూవీతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా నిలిచారు. "మిషన్ ఇంపాజిబుల్" చిత్రాన్ని నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అవినాష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. తమ టీంలోకి తాప్సిని ఆహ్వానిస్తూ మేకర్స్ ఓ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రం మహిళా ప్రధాన చిత్రంగా నిర్మితమయ్యే అవకాశం ఉందనిపిస్తోంది. ఇక చాలా రోజుల తరువాత తాప్సి తెలుగు సినిమాలో కన్పించడం ఆమె అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.