నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఈ నెలలో నోటిఫికేషన్.. !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. ఈ నెలలో మొత్తం 1238 ఎస్సీ, ఎస్టీ డిఎ బ్యాక్ లాగ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన 802 పోస్టుల్లో 432 ఎస్సీ 370 ఎస్టి లకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. కాగా ఈ ఉద్యోగాలకు ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


అంతేకాకుండా ఏపీ సర్కార్ జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్న విధంగా ప్రతి నెల లో ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తామని కూడా స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఈ జాబ్ క్యాలెండర్ పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ లో అసలు ఉద్యోగాలు లేవని ఆరోపణలు వస్తున్నాయి. చెప్పుకోవడానికి జాబ్ క్యాలెండర్ కానీ అది జాబ్ లు లేని క్యాలెండర్ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: