బ్రేకింగ్: ఏపీలో పరిక్షలు రద్దు అవుతాయా...?

కరోనా నేపధ్యంలో పరిక్షలను రద్దు చేసి విద్యార్ధుల ప్రాణాలను కాపాడాలి అనే డిమాండ్ ఉంది. కొన్ని రాష్ట్రాలు రద్దు చేసిన నేపధ్యంలో మిగిలిన రాష్ట్రాలు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా సరే దీనిపై కొన్ని రాష్ట్రాలు వెనక్కు తగ్గడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీం కోర్ట్ లో ఉంది.

రాష్టాల బోర్డుల పరీక్షల పై రద్దు పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపధ్యంలో ఏం జరుగుతుందనే ఆసక్తి ఉంది. 12 వ తరగతి పరిక్షలు నిర్వహిస్తామని ఏపీ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది. పరీక్షలు రద్దు చేయాలా,నిర్వహించాలి అనే అంశం పై జస్టిస్ ఎ. ఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరి తో కుడిన ధర్మాసనం నేడు తీర్పు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: