ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు జమ్మూకశ్మీర్ అకిలపక్షం సమావేశం కానుంది. ఈ సమావేశంలో జమ్మూ కశ్మీర్ భవిష్యత్ ప్రణాళికపై చర్చించనున్నారు. మద్యాహ్నం 3గంటలకు ప్రధాని మోడీ నివాసంలో సమావేశం జరగనుంది. మొత్తం 14 మంది సభ్యులను కేంద్రం సమావేశానికి ఆహ్వానించింది. అంతే కాకుండా సమాశంలో అసెంబ్లి నియోజకవర్గాల పునర్విభజన మరియు ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై కూడా చర్చించనున్నారు.
ఇదిలా ఉండగా ప్రధానితో కశ్మీర్ నేతల సమావేశం ఉండటంతో నియంత్రణరేఖ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. రెండు రోజుల పాటు హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు పాకిస్తాన్ తో కాల్పుల విరమణ ఒప్పంద్దం చేసుకున్నప్పటికీ బధ్రతను కట్టుదిట్టం చేశారు. అంతే కాకుండా కశ్మీర్ లో ఇంటర్నెట్ ను కూడా కట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసిన ఆర్టికల్ 370 రద్దు జరిగిన తర్వాత జరిగే మొదటి సమావేశం కావడంతో దీనిపై అందరికీ ఆసక్తి ఏర్పడింది.