ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డికి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు లేఖరాశారు.కరోనా కారణంగా రాష్ట్రంలో ఉన్న ఫోటో,వీడియోగ్రాఫర్లకు ఉపాధి కరువైందన్నారు.లాక్‌డౌన్ కారణంగా శుభకార్యాలు లేకపోవడంతో రెండు లక్షల మంది ఫోటో,వీడియోగ్రాఫర్లు ఉపాధి కోల్పోయారని తెలిపారు.వీరికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తక్షణం ఆర్థికసహాయం అందించాలని డిమాండ్ చేశారు.కరోనా మొదటి దశ లో 65 మంది, రెండవ దశ లో సుమారు 140 మంది ఫోటో,వీడియోగ్రాఫర్లు మరణించారని లేఖలో పేర్కొన్నారు.చనిపోయిన వారి కుటుంబసభ్యులకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదన్నారు. అన్ని కులవృత్తులు, చేతి వృత్తుల వారిని గుర్తించినట్లు వీరిని కూడా ఒక ప్రత్యేక వృత్తిగా గుర్తించాలన్నారు