ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేయనున్నారు. రాష్ట్రంలో కరోనాకు మరియు బ్లాక్ ఫంగస్ కు ఉచితంగా చికిత్స చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని గాంధీభవన్ లో దీక్షకు దిగుతున్నారు. ఈ రోజు ఉదయ నుండి మద్యాహ్నం వరకూ ఈ దీక్ష కొనసాగనుంది. అంతే కాకుండా రాష్ట్రంలో కరోనాకు ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చి బాధితులను ప్రైవేటు దోపిడీ నుండి కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.