కారుదిగ‌కుండానే వ్యాక్సిన్... ఎక్క‌డంటే..?

N.V.Prasd
కోల్‌క‌తా మున్సిప‌ల్ కార్పోరేష‌న్ వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ని ప్రారంభించింది. 45 సంవ‌త్సరాలు వ‌య‌సుపైబ‌డిన వారంద‌రికి వ్యాక్సిన్ వేస్తున్నారు.అయితే ఈ వ్యాక్సిన్ కేంద్రాల‌ను మాల్స్‌లో ఏర్పాటు చేశారు.ఈ భారీ షాపింగ్ మాల్స్ లో కార్ పార్కింగ్ ఏరియాలోనే వ్యాక్సిన్ డ్రైవ్ చేప‌ట్టారు. వ్యాక్సినేష‌న్‌కి వ‌చ్చిన వారు ఇన్‌గేట్ నుంచి లోప‌లికి వ‌చ్చి కారుదిగ‌కుండానే వ్యాక్సిన్ వేయించుకుని మ‌ళ్లీ అవుట్‌గేట్ ద్వారా వెళ్లిపోవ‌చ్చు.దీంతో ఎక్క‌డా కూడా ర‌ద్దీ లేకుండా వ్యాక్సిన్ డ్రైవ్ జ‌రుగుతుంది. జూన్ 15 వ‌ర‌కు ఈ వ్యాక్సిన్ డ్రైవ్ కొన‌సాగుతుంద‌ని అధికారులు చెప్తున్నారు. రోజుకు 400 స్లాట్లు వ‌ర‌కు బుక్ చేయబ‌డుతున్నాయ‌ని...కోవిన్ యాప్‌లో న‌మోదు చేసుకున్న వారికి మాత్ర‌మే వ్యాక్సిన్ వేస్తున్న‌ట్లు తెలిపారు.దీంతో పాటు కెఎంసీ వాట్స‌ప్ నెంబ‌ర్‌కు వ్యాక్సిన్ కోసం వ‌చ్చే వారి వాహ‌నాల నెంబ‌ర్ల‌ను పంపాల‌ని తెలిపారు.మొద‌టి రోజు 200 టీకాలు వేయ‌గా ఈ రోజు 400 మంది స్లాట్ బుక్ చేసుకున్న‌ట్లు అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: