తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ డాక్టర్ లు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. కాగా డిమాండ్ లు పరిష్కరించాలంటూ రెండో రోజు విధులు బహిష్కరిస్తూ జుడాలు మరియు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. తమ స్టైఫండ్ ను రూ.45 వేల నుంచి రూ. 80వేలకు పెంచాల్సి ఉందంటుందని డిమాండ్ చేస్తున్నారు. కొవిడ్ డ్యూటీలు చేస్తున్న మెడికల్ విద్యార్థులకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా స్టైఫండ్ నుంచి టీడీఎస్ కటింగ్ లేకుండా చూడాలని కోరుతున్నారు. తన డిమాండ్లన్నీ పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా 1000 మంది విద్యార్థులు విధులు బాయ్ కాట్ చేస్తున్నారు.
నిన్న జుడాలతో అధికారులు చర్చలు జరిపినప్పటికీ అవి ఫలించనట్టు తెలుస్తుంది. జూడాలు స్టైఫండ్ ను 45 నుండి 80వేలకు పెంచాలని కోరగా ప్రభుత్వం 65 వేలకు పెంచేందుకు అంగీకరించింది. దానికి జూడాలు ఒప్పుకోలేదు. స్టైఫండ్ 80వేలు ఇవ్వాలని, ఇతర డిమాండ్ లు కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెను రెండోరోజు కూడా కొనసాగిస్తున్నారు. దాంతో జూనియర్ డాక్టర్ లతో మరోసారి చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం స్టైఫండ్ ను 65వేలకు పెంచుతామని హామీ ఇచ్చినా జగన్ ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా జూడాలు సమ్మెను కొనసాగిస్తున్నారు.