ఢిల్లీ హైకోర్ట్ లో ఫేస్బుక్ పిటీషన్... సమస్యే లేదంటున్న కేంద్రం

సోషల్ మీడియా దుర్వినియోగాన్ని ఆపే లక్ష్యంతో సోషల్ మీడియా కంపెనీల కోసం కొత్త ఐటి నియమాలను రూపొందించామని కేంద్రం స్పష్టం చేసింది. కొత్త ఐటి నిబంధనలు సోషల్ మీడియాలో ప్రైవసీ కి భంగం కలిగిస్తాయని ఢిల్లీ హైకోర్ట్ లో ఫేస్ బుక్ పిటీషన్ దాఖలు చేసిన నేపధ్యంలో కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పందించారు. యూజర్ల డేటాను కేంద్రం ఎప్పుడూ గుర్తించి గౌరవిస్తుంది అన్నారు.

వాట్సాప్ విషయంలో కొత్త నిబంధనల గురించి భయపడాల్సిన అవసరం లేదు అని యూజర్లకు స్పష్టం చేసారు. నేరాలను ఎవరు మొదలు పెడుతున్నారో తెలుసుకోవడమే తమ లక్ష్యం అని ఆయన క్లారిటీ ఇచ్చారు. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత మరియు భద్రత, ప్రజా క్రమం, అత్యాచారం, పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన నేరాల దృష్టిలో పెట్టుకుని కేంద్రం వెళ్తుందని, ప్రభుత్వం ప్రశ్నించే హక్కుని హరించడం లేదని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: