ఈద్ ఉల్ ఫితర్.. ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు అందరు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. రంజాన్ మాసం ముగింపు సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ముస్లింలకు చాలా ప్రత్యేకం . ఈమాసంలో ముస్లింలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉంటారు. ఈద్ సందర్భంగా సెలబ్రిటీలు అందరు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో అందరికి మంచి ఆరోగ్యం, ఆనందం, సంతోషం అందించాలని కోరుకుంటున్నాను అంటూ ముస్లిం సోదరసోదరీమణులకు నటసింహ నందమూరి బాలకృష్ణ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.