శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రసాద్‌రావు పెద్దినేని నిర్మాణంలో, హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో దినేష్ తేజ్, అనన్య నాగళ్ల మెయిన్ లీడ్ గా నటించిన చిత్రం "ప్లే బ్యాక్". గత నెలలో మార్చ్ 5 న విడుదల అయిన ఈ సినిమా ఇకపై OTT లో సందడి చేయనుంది. తొలి తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన ఆహాలో మే 21 న విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో దివంగత ప్రముఖ జర్నలిస్ట్ మరియు యాంకర్ అయిన TNR కీలకమైన పాత్రలో నటించారు. నటన పరంగా ఆయనకు ఇది మంచి సినిమా అని చెప్పాలి.