యువ నటుడు ప్రియదర్శి నటించిన ‘కంబాలపల్లి కథలు’ అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. ఈ వెబ్‌సిరీస్‌లో ఛాప్టర్1గా వచ్చిన ‘మెయిల్’ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. కాగా.. ఇప్పుడు అది ఏకంగా న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021కు ఎంపికైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ స్వప్న సినిమా ట్విటర్లో పంచుకుంది. "ఈ క్లిష్ట సమయంలో ప్రపంచానికి ఒక సంతోషకరమైన ‘మెయిల్’ పంపిస్తున్నాం. జూన్ 4న న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో మా చిత్రాన్ని చూడండి" అంటూ ఆ ట్వీట్లో పేర్కొంది.