ఘోర రోడ్డు ప్రమాదం : సీఐ దంపతులు మృతి

Mamatha Reddy
శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట నుండి హైదరాబాద్ వస్తున్న స్విఫ్ట్‌ కారు వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ కారులో సుల్తాన్ బజార్ సీఐ ఎస్‌. లక్ష్మణ్ మరియు అతడి భార్య ఝాన్సీ ఉన్నారు. ఇద్దరు ప్రమాదస్థలిలోనే అక్కడికక్కడే కన్ను మూసారు. ప్రమాదం జరిగిన సమయంలో లక్ష్మణ్ భార్య ఝాన్సీ కారు నడుపుతున్నట్టు గా తెలుస్తుంది. ఈ సంఘటనకు చెందిన మరింత సమాచారం రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: