ఏపీ, తెలంగాణ ప్ర‌జ‌లారా అలెర్ట్‌.. క‌రోనా పేరుతో కొత్త దోపిడి

VUYYURU SUBHASH
క‌రోనా పేరుతో దోపిడీ బాగా పెరిగిపోయింది. హాస్ప‌ట‌ల్స్ నుంచి చివ‌ర‌కు చ‌నిపోయాక ఫ్రీజ‌ర్ బాక్సులు, చితి వ‌ర‌కు ఎవ‌రికి వారు త‌మ‌కు అందినంత దోచేసుకుంటున్నారు. ప్రాణ‌భ‌యంతో జ‌నాలు కూడా ఎవ‌రికి తోచినంత వారు స‌మ‌ర్పించేసుకుంటున్నారు. వీరి భయాన్ని కూడా కొంద‌రు ఆస‌రాగా చేసుకుని అందినంత దోచేసుకుంటున్నారు. ఈ దోపిడీల్లోనూ కొత్త దోపిడీలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా తెలంగాణ‌లోని మహబూబాబాద్ జిల్లా చిన్నగూడురులో లక్షణాలు లేని కరోనా పేషెంట్‌ను భయపెట్టి మాచర్ల ఉపేందర్ అనే స్థానిక ఆర్ఎంపీ ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాడు.

ఖమ్మంలోని ఆస్పత్రిలో చేర్పించిన అనంతరం కమీషన్ తీసుకుని కనిపించకుండా పోయాడు. సదరు వ్యక్తికి గంటల్లోనే ఆసుపత్రి యాజమాన్యం లక్ష రూపాయలు బిల్లు వేసింది. ఆస్పత్రితో పాటు ఆర్ఎంపీపై బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేశాడు. ప్ర‌జ‌లు ఇలాంటి దోపిడీల‌కు గురి కాకుండా అలెర్ట్‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: