సుప్రీం తీర్పుపై సీఎం చిందులు

VUYYURU SUBHASH
మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు రిజ‌ర్వేష‌న్లు 50 శాతం దాట‌డం స‌మాన‌త్వ‌పు హ‌క్కుకు భంగం క‌లిగించ‌డ‌మే అని తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఉద్ద‌వ్ త‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్రమోడీ అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాలని ఉద్ధవ్ ధాక్రే డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై వెంటనే స్పందించ‌కుంటే న్యాయం జరగదని ఉద్ధవ్ ధాక్రే అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: