తెలంగాణలో ఈ రోజు మినీ సంగ్రామం జరగనుంది. మొత్తం రెండు కార్పొరేషన్లు, 5 మున్సి పాలిటీలు, కొన్ని మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డుకు నేడు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరుగుతుంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్ది పేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్‌లో కోవిడ్– 19 నిబంధనలను హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ఆదేశించారు. మే 3న ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఫలితాల ప్రకటన ఉంటుంది.