మ‌రో వైసీపీ ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్‌

VUYYURU SUBHASH
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజుకు కేసుల సంఖ్య 15 వేల‌కు చేరువ అవుతోంది. ఇక ఇప్ప‌టికే ప‌లువురు ఎమ్మెల్యేల‌కు క‌రోనా సోకింది. కొంద‌రికి అయితే రెండు సార్లు కూడా క‌రోనా వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే మ‌రో వైసీపీ ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఎలీజాకు కరోనా సోకింది. ఆయనతో పాటు సోదరుడికి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. తనను కలసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: