బిగ్ బ్రేకింగ్: విమాన సర్వీసులు క్యాన్సిల్.. ప్రభుత్వం ఆదేశాలు
ఆదివారం ముంబై-హాంకాంగ్ విమానంలో ముగ్గురు ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్‌గా రాగా.. ఏప్రిల్ 4న విస్తారా యొక్క ఢిల్లీ -హాంకాంగ్ విమానంలో వెళ్లిన మొత్తం 47 మంది ప్రయాణికులు హాంకాంగ్‌లో పాజిటివ్‌గా వచ్చింది. షాక్ అయిన హాంకాంగ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏప్రిల్ 6వ తేదీ వరకు విమానాల రాకపోకలపై నిషేధం విధించగా.. తాజా కేసులతో భారత్‌ను టచ్ చేసే అన్ని విమానాలను మే 3వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.