తిరుపతి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి మండలం పేరంకొండ పోలింగ్ కేంద్రంలో కరోనా కలకలం సృష్టించింది. పోలింగ్ అధికారికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పోలింగ్ ప్రక్రియ ప్రస్తుతానికి ఆగిపోయింది. ప్రస్తుతం ఆ పోలింగ్ అధికారిని ప్రత్యేక గదిలో ఉంచారు. పోలింగ్ అధికారికి కరోనా అని తేలడంతో ఓటేసేందుకు క్యూలో బారులు తీరిన అధికారులు లోపలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. వెంటనే రంగంలోకి దిగిన శానిటైజేషన్ సిబ్బంది గ్రామంలో శానిటేషన్ చేస్తున్నారు. అయితే పోలింగ్ మధ్యాహ్నం తర్వాత మళ్లీ తిరిగి ప్రారంభం అవుతుందా..? లేకుంటే పూర్తిగా ఆపేస్తారా..? అనేది తెలియరాలేదు.