టీడీపీ.. చంద్రబాబుపై ఎప్పుడు ట్విట్టర్లో అదిరిపోయే సెటైర్లతో విరుచుకు పడే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తాజాగా మరోసారి చంద్రబాబు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును టార్గెట్ చేస్తూ అదిరిపోయే సెటైర్లతో విరుచుకు పడ్డారు. చంద్రబాబును ఉద్దేశించి సినిమా ప్రమోషన్లలో హీరో, హీరోయిన్లు, కమెడియన్లు పాల్గొని సక్సెస్ కోసం వాళ్ల తిప్పలేవో వాళ్లు పడుతుంటారు. ప్యాకేజి స్టార్ రీమేక్ మూవీ కోసం బాబు, అను’కుల మీడియా, బిజెపి పెద్దలు ‘పోస్టర్లు అతికించే’ స్థాయికి దిగజారడం రాజకీయాలకు దాపురించిన దరిద్రం కాక మరేంటి ? అని పవన్ వకీల్‌సాబ్ సినిమాను ఊటంకిస్తూ ట్వీట్ చేశారు.
ఇక అచ్చెన్నాయుడు వీడియోను టార్గెట్ చేస్తూ
నాడు: టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ నినాదం: “సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు”.
నేడు: టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నినాదం: “పార్టీ లేదు... బొక్కా లేదు” ఇదే నినాదం అని సెటైర్ వేవారు.