మోడీకి షాక్‌... వార‌ణాసిలో కాంగ్రెస్ గెలుపు

VUYYURU SUBHASH
ప్రధాని నరేంద్ర మోడీకి పెద్ద షాక్ త‌గిలింది. ఆయ‌న ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్‍‍యూఐ విజయం సాధించింది. ఈ విజ‌యం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. వారణాసిలో ఉన్న సంపూర్ణానంద్ సంస్కృత యూనివర్సిటీలో జరిగిన ఎన్నికల్లో ఎన్ఎస్‍‍‍యూఐ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నిక‌ల‌ను రెండు సంస్థ‌లు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ఈ క్ర‌మంలోనే బీజేపీ విద్యార్థి విభాగ అనుబంధం సంస్థ అయిన ఏబీవీపీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. వన్ సైడ్ గా ఎన్ఎస్‌యూఐ విజయం సాధించింది. దీంతో స్థానికంగా కాంగ్రెస్ శ్రేణులు సంబ‌రాలు చేసుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: