పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వీరంగం ఆడుతోంది. తొలి రోజు తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో వకీల్‌సాబ్ విజృంభణకు అడ్డులేకుండా పోయింది. యూఎస్‌లో ఇప్పటి వరకు ఈ సినిమా 120 K డాలర్లు వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్ ముగియకుండానే 1 మిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. ఇక ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు A $ 212K వసూలు చేసింది. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్‌కు జోడీగా శృతీ హాసన్ నటించిన ఈ సినిమాలో నివేదా థామస్ - అనన్య పాండే - అంజలి కీలక పాత్రల్లో నటించారు.