తెలంగాణలో కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. నాగార్జునా సాగర్ ఉప ఎన్నిక ముగిశాక వెంటనే పలు ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. పెండింగ్‌లో ఉన్న కార్పోరేషన్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించనున్నారు. ఎన్నికలు జరిగే ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పటికే సూచనలు చేశారు. సాగర్ ఎన్నికలు పూర్తవగానే అక్కడి నుంచి నేరుగా సొంత జిల్లాలకు వెళ్లి కార్పొరేషన్ ఎన్నికల పనిలో ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.
గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. వరగంల్, ఖమ్మం కార్పొరేషన్ల పాలక మండలి గడవు మార్చి 21తో ముగిసింది. సిద్ధిపేట కార్పొరేషన్ల పాలక మండలి గడవు ఈనెల 15తో పూర్తవుతోంది.