హైకోర్ట్ తీర్పు ఏమో గాని... ఎన్నికలకు రెడీ అవుతున్న అధికారులు...!
వివిధ జిల్లాల్లో డిస్ర్టిబ్యూషన్ సెంటర్లకు వస్తున్న సిబ్బందిలో అయోమయం నెలకొంది. డ్యూటీలో రిపోర్టు చేయమన్నారని చెబుతున్న సిబ్బంది... ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని అంటున్నారు. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ తదనంతర ప్రక్రియ పై సింగిల్ జడ్జి స్టే ఇచ్చారు. సింగిల్ జడ్జి తీర్పును డివిజనల్ బెంచ్‌లో సవాల్ చేసిన ఎస్ఈసీ పిటీషన్ పై నేడు విచారణ జరుగుతుంది. ఎస్ఈసీ 1వతేదీన ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం రేపు పోలింగ్ జరగాల్సి ఉంది. డిస్ర్టిబ్యూషన్ సెంటర్లకు సిబ్బంది వస్తుండటంతో ఉన్నతాధికారులు అయోమయంలో ఉన్నారు.