వివాదాస్పద సినిమాలను తెరకెక్కిస్తూ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు తన పబ్లిసిటీని పెంచుకుంటారు. ఓ వైపు సంచలన సినిమాలను తీస్తూ, మరోవైపు పలు రాజకీయ, సామాజిక అంశాలపై తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తారు. తాజాగా ఆయన తెలంగాణలోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్ ఆభ్యర్థిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి."ఒక అభ్యర్థి ఒక పెంపుడు శునకాన్ని దాని గొలుసు పట్టుకొని తీసుకెళ్తున్నట్లుగా అవలీలగా భగత్ ఆ పులిని పట్టుకొని వెళ్తుండడం ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది.
‘వామ్మో.. కేసీఆర్, కేటీఆర్‌లు టైగర్, సింహాలని మనకు తెలుసు. కానీ, ఇలా నోముల భగత్ చిరుత పులిని వాకింగ్‌కి తీసుకెళ్తుండడం నాకెంతో నచ్చింది. ఒకవేళ నాకే కనుక నాగార్జున సాగర్‌లో ఓటు హక్కు ఉంటే 17వ తేదీన నా ఓటు ఇతనికే వేసేవాణ్ని’’ అంటూ ట్వీట్ చేశారు.రామ్ గోపాల్ వర్మ మరో ట్వీట్ చేస్తూ ‘‘ఈ అభ్యర్థి నోముల భగత్ ‘మాకు ఓటు వేయండి. నాగార్జున సాగర్‌లో మన గర్జనకు ఏ ఒక్క పార్టీ నిలవలేదు’ అంటున్నారు. కానీ, నేను ఇలా చిరుత పులితో కలిసి ప్రచారంలో పాల్గొంటున్న వ్యక్తిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదు’’ అని మరో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.