ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త సీఎస్ఈ నీలం సాహ్నీ నోటిపికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 8వ తేదీన ఎన్నికలతో పాటు 10న కౌంటింగ్ జరపాలని ఆమె నిర్ణయించారు. అయితే దీనిపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికలను బహిష్కరించాలని పార్టీ పోలిట్‌బ్యూరోలో నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. కొత్త సీఎస్ఈగా వచ్చిన వెంటనే నీలం సాహ్నీ ఎలా ఎన్నికలు నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు.
అధికార పార్టీ చర్యలతో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని ఆయన అన్నారు. ఏపీలో రాజ్యాంగ బద్ధంగా ఎన్నికలు జరగలేదని.. నిబంధనలు పక్కన పెట్టేసి మరీ ఎన్నికలు నిర్వహిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.