ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యిందో లేదో వెంటనే రాజకీయ విమర్శలు స్టార్ట్ అయ్యాయి. గత నోటిఫికేషన్‌ను కొత్త సీఎస్‌సీ నీలం సాహ్నీ కంటిన్యూ చేస్తూ నోటిపికేషన్ రిలీజ్ చేయడం నచ్చని వారంతా కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నోటిపికేషన్ సవాల్ చేస్తూ భాజపా హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఉన్నత న్యాయస్థానం మరికాసేపట్లో పిటిషన్‌పై విచారించే అవకాశముంది. ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలంటూ మరో ముగ్గురు పిటిషన్ దాఖలు చేశారు.