మార్చిలో జీఎస్టీ వ‌సూళ్లు ఆల్ టైం రికార్డ్‌... వామ్మో ఇన్ని కోట్లా..!

VUYYURU SUBHASH
జీఎస్టీ వ‌సూళ్లు దేశ చ‌రిత్ర‌లోనే స‌రికొత్త రికార్డు క్రియేట్ చేశాయి. మార్చిలో వసూళ్లు రూ.1.23 లక్షలుగా నమోదయినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్థాయి వసూళ్లు ఇదే తొలిసారి. దీంతో ఈ వ‌సూళ్లు ఆల్ టైం రికార్డు స్థాయి వ‌సూళ్లుగా జీఎస్టీ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు నిలిచాయి. 2020 ఇదే నెలతో పోల్చితే 27 శాతం అధికం. 2020 మార్చిలో జీఎస్‌టీ ద్వారా వచ్చిన ఆదాయం రూ.97,590 కోట్లు.  ఎకానమీ వేగంగా పురోగమిస్తోందనడానికి జీఎస్‌టీ గణాంకాలు సంకేతమని ఆర్థికశాఖ తెలిపింది. ఇక ప‌టిష్ట‌మైన ప‌న్ను యంత్రాంగం ద్వారానే జీఎస్టీ వ‌సూళ్లు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయ‌ని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: