దేశవ్యాప్తంగా రోజు రోజుకు గ్యాస్, పెట్రోల్,
డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనిపై వినియోగదారులు ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా కేంద్రం మాత్రం రేట్లు తగ్గించే విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇక గత ఫిబ్రవరిలో వంట గ్యాస్ ధరను రూ.125 పెంచిన ప్రభుత్వరంగ చమురు కంపెనీలు.. సిలిండర్ ధరను రూ.10 తగ్గిస్తున్నట్టు బుధవారం ప్రకటించాయి. ఈ రేట్లు ఈ రోజు అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తున్నాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో రూ.819 ఉన్న 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.809కి చేరుతుంది. ఇతర మార్కెట్లలోనూ తగ్గించిన ధర అమల్లో ఉంటుందని కంపెనీలు తెలిపాయి.