ఏపీలో కూల్ వాతావ‌ర‌ణం... ఎన్ని రోజులు వ‌ర్షాలు అంటే...

VUYYURU SUBHASH
గ‌త కొద్ది రోజులుగా మండుటెండలతో బెంబేలెత్తుతున్న ఏపీకి కొంత ఉపశమనం కలగనుంది. వాయవ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవ నున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. విశాఖ,ఉభయగోదావరి జిల్లాలు,ఉత్తరాంద్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా,రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: