ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి ప్రశంసించారు. రైతు సమస్యల పట్ల జగన్ చిత్తశుద్ధిని ఆయన కొనియాడారు. గతంలో కూడా నారాయణ మూర్తి పలుసార్లు సీఎం జగన్ పాలనకు కితాబు ఇచ్చారు. ఈ క్రమంలోనే మరోసారి ఆయన జగన్‌పై తనకు ఉన్న అభిమానం చాటుకున్నారు.
తూర్పు గోదావరి - విశాఖ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఏలేరు, తాండవ కాల్వల అనుసంధానం పనులకు నిధులు మంజూరు చేయడం సంతోషించదగ్గ విషయమని నారాయణమూర్తి అన్నారు. గత ప్రభుత్వాలు తూర్పుగోదావరి, ,విశాఖ జిల్లాలోని మెట్ట ప్రాంతాలను పట్టించుకోలేదని చెప్పారు. జగన్ ముందు చూపుకు నారాయణమూర్తి అభినందించారు.